![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'( karthika Deepam2 ).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -707 లో.....జ్యోత్స్న రెస్టారెంట్ కి కొత్త సీఈఓ దీప అని శివన్నారాయణ చెప్తాడు. ఇది ఎవరో త్యాగం చేస్తే తనకి వచ్చింది కాదు.. తన సొంత ట్యాలెంట్ తో సంపాదించుకుందని శివన్నారాయణ చెప్తాడు. అందరు దీపకి కంగ్రాట్స్ చెప్తారు. ఆ తర్వాత ఇక నేను వెళ్తానని సూరజ్ అంటాడు. ఎక్కడికి వెళ్ళేది దీప సీఈఓ.. తనకి హెల్ప్ చెయ్యడానికి నువ్వు ఇక్కడే ఉండాలని శివన్నారాయణ ఆర్డర్ వేస్తాడు.
ఇక తప్పు చేసిన జ్యోత్స్న, పారిజాతానికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందేనని శివన్నారాయణ అంటాడు. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో తెలిస్తే మమ్మీ ఇంట్లో అడుగుపెట్టనివ్వదని జ్యోత్స్న భయపడుతుంది. ఈ విషయం ఇంట్లో చెప్పకండి అని శివన్నారాయణ కాళ్లపై పారిజాతం పడుతుంది. ఈ విషయం ఇంట్లో అయితే చెప్పను కానీ మీకు అయితే పనిష్మెంట్ ఉంటుందని శివన్నారాయణ అంటాడు. మరొకవైపు అందరు ఇంటికి వెళ్తారు. సుమిత్ర దగ్గర దీప ఆశీర్వాదం తీసుకుంటుంది. వీళ్ళేంటి అలా ఉన్నారని జ్యోత్స్న, పారులని ఉద్దేశ్శించి సుమిత్ర అంటుంది. ఏం లేదు మమ్మీ దీప గెలిచించందుకు నాకు హ్యాపీగా ఉంది. తను కూడా మన ఫ్యామిలీనే కదా అని జ్యోత్స్న అంటుంది.
ఆ తర్వాత సుమిత్ర, దశరథ్ వెళ్ళాక.... తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి సర్ అని కార్తీక్ అంటాడు. ఏం శిక్ష వెయ్యలని శివన్నారాయణ అంటాడు. నా భార్యని ఎప్పుడు పనిమనిషి అంటుంది. అది నాకు హర్టింగ్ గా ఉందని కార్తీక్ అంటాడు. పారిజాతం ఇక నుంచి నేత చీరలు కట్టుకోవాలి.. మేకప్ నగలు వెయ్యొద్దు.. నేల మీద పడుకోవాలి.. భోజనం ఒక్క పూటే చేయాలి.. తను కరెక్ట్ చెయ్యకపోతే మళ్ళీ వారం ఎక్స్ ట్రా పనిష్మెంట్ తను చేసేలా నువ్వు చూడాలని కార్తీక్ కి శివన్నారాయణ చెప్తాడు. జ్యోత్స్న పనిష్మెంట్ గురించి తర్వాత చెప్తానని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |